తనకు ప్రాణహాని ఉందంటూ ఏపీ మాజీ మంత్రి?
తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణ రాజు పోలీసులను ఆశ్రయించారు. తన కొడుకు, కోడలి నుంచే తనకు ప్రాణహాని ఉందని ఆయన బంజారాహిల్స్ పోలీసులకు [more]
తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణ రాజు పోలీసులను ఆశ్రయించారు. తన కొడుకు, కోడలి నుంచే తనకు ప్రాణహాని ఉందని ఆయన బంజారాహిల్స్ పోలీసులకు [more]
తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణ రాజు పోలీసులను ఆశ్రయించారు. తన కొడుకు, కోడలి నుంచే తనకు ప్రాణహాని ఉందని ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కొడుకు, కుమార్తె తన ఆస్తుల కోసం తనను చంపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాను తన తదనంతరం తన కొడుకు పేరుపై ఆస్తి రాసిచ్చినా, ఇప్పుడే తనకు కావాలంటూ తనను వేధిస్తున్నారని కంతేటి సత్యనారాయణ రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాడేపల్లి గూడెంలోని తన అత్తకు చెందిన భూమిని ఆక్రమించే ప్రయత్నం చేశారని కంతేటి సత్యనారాయణ రాజు తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు.