టీఆర్ఎస్ నాట్ హ్యాపీ.. కోమటిరెడ్డి vx టీఆర్ఎస్
మునుగోడులో ఎనిమిది రౌండ్లు పూర్తయ్యాయి. ఒక్కటి మాత్రం నిజం. ఈ ఎన్నిక కోమటిరెడ్డి వర్సెస్ టీఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు.
ఈ ఎన్నిక ఫలితాలు వెలువడుతున్నాయి. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యాయి. అయితే ఒక్కటి మాత్రం నిజం. ఈ ఎన్నిక కోమటిరెడ్డి వర్సెస్ టీఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు. బీజేపీకి ఇక్కడ పెద్దగా ఓటు బ్యాంకు లేదు. ప్రతి రౌండ్ లోనూ కేవలం వందల్లోనే మెజారిటీ వస్తుంది. అంటే నెక్ టు నెక్ పోటీ జరుగుతుంది. ఏ రౌండ్ లోనూ టీఆర్ఎస్ కు ఆశించిన మెజారిటీ రాలేదు. దీన్ని బట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీఆర్ఎస్ కు మాత్రమే ఇక్కడ పోటీ జరిగిందన్నది వాస్తవం. కోమటిరెడ్డిని చూసే ఇన్ని ఓట్లు పోలయ్యాయన్నది విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు.
డబ్బు, మద్యం...
ఇక ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ డబ్బు, మద్యం విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. ఒక పార్టీ ఓటుకు ఐదు వేలు ఇస్తే, మరో పార్టీ నాలుగు వేలు ఇచ్చింది. ఇక మద్యం సంగతి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఏరులై పారింది. ఈ ఎన్నికల సమయంలో 300 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు చూపుతున్నాయి. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి 3,285 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ మొగ్గు చూపగా, గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది.
ఎంతమందిని నియమించినా...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు వంద మంది ఎమ్మెల్యేలను గ్రామాల వారీగా ఇన్‌ఛార్జులుగా నియమించారు. మినిస్టర్లకు ఒక్కో మండలాన్ని అప్పగించారు. క్లస్టర్లుగా చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా టైట్ ఫైట్ కొనసాగుతుంది. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో ఈ రకమైన ఉత్కంఠతను చూశాం. మళ్లీ మునుగోడులో సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. టీఆర్ఎస్ గెలిచినా నైతికంగా గెలుపు కాదని బీజేపీ నేతలు అప్పుడే స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. అది వారి విషయంలో నిజమే కావచ్చు కాని. కమలం గుర్తున చూసి ఓట్లు వేయలేదన్నది అంతే వాస్తవం.
వ్యూహాలు మాత్రం...
కోమటిరెడ్డి వ్యక్తిగత ఇమేజ్ ఇందుకు ఉపయోగపడింది. కోమటిరెడ్డి ప్రతి రౌండ్ లోనూ గట్టిపోటీ ఇచ్చారు. చౌటుప్పల్ లో తాను అనుకున్నంత స్థాయిలో మెజారిటీ రాకపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. టీఆర్ఎస్ కూడా ఈ ఫలితాల పట్ల ఏమాత్రం సంతోషంగా లేదు. ఉప ఎన్నికల్లోనే ఇలా ఉంటే ఇక జనరల్ ఎలక్షన్స్ సంగతి ఏంటన్న చర్చ అప్పుడే పార్టీలో మొదలయింది. బలమైన నేతలు ఉన్నచోట ఉప ఎన్నికల్లో ఎన్ని వ్యూహాలు రచించినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనుకున్న స్థాయిలో ఓట్లు పోలవ్వక పోవడం పట్ల టీఆర్ఎస్ నేతలు హ్యాపీగా మాత్రం లేరు.