పబ్ లో కొకైన్.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

రాడిసన్ పబ్ లో డ్రగ్స్ దొరికినట్లు తెలుస్తోంది. పబ్ పై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు కొకైన్ లభించినట్లు సమాచారం.

Update: 2022-04-03 04:38 GMT

రాడిసన్ పబ్ లో డ్రగ్స్ దొరికినట్లు తెలుస్తోంది. పబ్ పై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు కొకైన్ లభించినట్లు సమాచారం. పోలీసులు దాడి చేయగానే 12 ప్యాకెట్లు కొకైన్ ను కిటికీ నుంచి బయటపడేశారు. వీటిని టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పబ్ లో మొత్తం 150 మంది ఉండగా అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి సంతకాలు తీసుకుని పంపించివేశారు. ఐదుగురిని మాత్రం పోలీసులు అదుపులో ఉంచుకున్నారు.

మాజీ ఎంపీ కూతురు....
అయితే ఈ పబ్ ఒక మాజీ ఎంపీ కుమార్తె ది కావడంతో పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసినా అక్కడ వారిలో కేవలం ఐదుగురిని మాత్రమే అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. సెలబ్రిటీల కుటుంబ సభ్యులు కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వారందరినీ విడిచి పెట్టడం విమర్శలకు తావిస్తుంది.



 


అదుపులో ఐదుగురు....
రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్ గత కొన్నాళ్లుగా పార్టీలను నిర్వహిస్తుంది. పబ్ కు 12 గంటల వరకూ సమయం ఉన్నప్పటికీ తెల్లవారు జాము వరకూ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. శనివారం కావడంతో ఆదివారం ఉదయం దాకా ఇక్కడ పార్టీ జరిగింది. పబ్ ను పోలీసులు సీజ్ చేశారు. మొత్తం మీద రాడిసన్ బ్లూ హోటల్ లో పోలీసుల దాడి, అనంతరం జరిగిన పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.


Tags:    

Similar News