ద్రౌపది ముర్మును ఎందుకు ప్రకటించారంటే?

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపిక వ్యూహాత్మకంగానే జరిగిందంటున్నారు.

Update: 2022-06-22 02:00 GMT

బీజేపీ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపిక వ్యూహాత్మకంగానే జరిగిందంటున్నారు. ముర్ము ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని ముందు నుంచే కొంత ప్రచారం జరిగింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో దీనిని అధికారికంగా ధృవీకరించారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి కోసం కమిటీలను నియమించింది. అందరి అభిప్రాయాలను సేకరించింది. చివరకు ద్రౌపది ముర్ము తమ అభ్యర్థిగా మేలన్న అభిప్రాయానికి వచ్చింది.

జేఎంఎం, బీజేడీ మద్దతు...
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జార్ఖండ్ లో జేఎంఎం, ఇటు ఒడిశాలో బిజూ జనతాదళ్ మద్దతు ప్రకటించే అవకాశాలాన్నాయి. గిరిజన వర్గానికి చెందిన వారు కావడంతో ఆదివాసీలు బీజేపీ పక్షాన భవిష్యత్ లో నిలుస్తారని బీజేపీ ఈ ఎంపిక చేసినట్లు కనపడుతుంది. అంతేకాకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో సజావుగా తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించేందుకు కూడా ముర్ము ఎంపిక తోడ్పడనుంది. విపక్షాల్లోని కొన్ని పార్టీలు ఈ ఎంపికతో కొంత డైలమాలో పడే అవకాశముంది. ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల కోసం టీఆర్ఎస్ కూడా ఆదివాసీల ఓట్ల కోసం ముర్ముకు మద్దతు తెలిపే అవకాశాలు లేకపోలేద. 20 మంది పేర్లను పరిశీలించామని చెబుతున్న బీజేపీ చివరకు ద్రౌపది ముర్మును ఎంపిక చేసి విపక్ష పార్టీలను కొంత అయోమయంలో పడేసిందనే చెప్పాలి.
తొలి గిరిజన మహిళగా....
ద్రౌపది ముర్ముకు 64 ఏళ్లు. టీచర్ గా జీవితం ప్రారంభించిన ద్రౌపది ముర్ము రాజకీయాల్లోకి వచ్చారు. ఒడిశాలో ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేశారు. అనంతరం జార్భండ్ గవర్నర్ గా కూడా ఆమె పనిచేశారు. వివాదాలకు పోని ద్రౌపది ముర్ము పేరు విపక్షాల్లోని కొన్ని పార్టీలను సయితం ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ద్రౌపది భర్త పేరు శ్యామ్ చరణ్ ముర్ము, వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల ద్రౌపది ముర్ము ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రపతిగా ఎంపికయితే తొలి గిరిజన మహిళగా ఆమె రికార్డులకు ఎక్కుతారు.


Tags:    

Similar News