బ్రేకింగ్ : సీఐడీ విచారణకు జగన్ ఆదేశం

డాక్టర్ అనిత వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన డాక్టర్ అనితారాణి వైసీపీ నేతలు తనను నిర్బంధించి తనను అవమానించారని ఆరోపించిన [more]

Update: 2020-06-08 12:42 GMT

డాక్టర్ అనిత వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన డాక్టర్ అనితారాణి వైసీపీ నేతలు తనను నిర్బంధించి తనను అవమానించారని ఆరోపించిన సంగతి తెలిసిందే. డాక్టర్ సుధాకర్ లాగానే తనకూ అవమానం జరిగిందని డాక్టర్ అనిత ఆరోపించారు. దీనిపై ఈరోజు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ కూడా ట్వీట్ ద్వారా డాక్టర్ అనిత వ్యవహారాన్ని ప్రస్తావించారు. చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వ డాక్టర్ అనిత వ్యవహారం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా తయారైంది. దీంతో జగన్ దీనిన సీఐడీకి అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు జగన్ ఆదేశించారు.

Tags:    

Similar News