సికింద్రాబాద్ కు పాకిన అగ్నిపథ్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ లో మూడు గంటల నంచి విధ్వంసం జరుగుతుంది. రైళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.

Update: 2022-06-17 05:12 GMT

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ లో మూడు గంటల నంచి విధ్వంసం జరుగుతుంది. రైళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. స్టాళ్లను పగులకొట్టారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ కు నిరసనగా ఆర్మీ స్టూడెంట్స్ రైల్వే స్టేషన్ లో బీభత్సం సృష్టించారు. రెండు సంవత్సరాల నుంచి తమకు ఆర్మీ పరీక్షలు పెట్టడం లేదని, కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ కారణంగా తాము తీవ్రంగా నష్టపోతామని ఆందోళనకారులు చెబుతున్నారు.

రైల్వేస్టేషన్ లో విధ్వంసం....
తెలంగాణ వ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థులు 2,500 మంది వరకూ ఉన్నారు. వీరంతా ఒక్కసారిగా రైల్వే స్టేషన్ పై పడటంతో పోలీసులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. సికింద్రాబాబ్, 1,2, ,3,4,5, ప్లాట్‌ఫారాలపై బీభత్సం సృష్టించారు. రైళ్లపై రాళ్లు విసరడం, అద్దాలు పగలకొట్టడమే కాకుండా కొన్ని బోగీలకు నిప్పంటించారు. ఒక్కసారిగా ఆర్మీ అభ్యర్థులు దాడి చేయడంతో రైల్వే పోలీసులు ఏమీ చేయలేకపోయారు.
తగలబడిన బోగీలు...
దీంతో రైల్వే స్టేషన్ లో వేచి ఉన్న ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. అన్ని రైళ్లను నిలిపివేశారు. పట్టాలపై వాహనాలను తెచ్చి పడేసి తగులపెట్టారు. రైల్వేస్టేషన్ మొత్తం బీభత్సంగా మారింది. తేరుకున్న అధికారులు అదనపు పోలీసులను రంగంలోకి దింపారు. ట్రాక్ మీద ఉన్న రాళ్లను ఉపయోగిస్తూ విధ్వంసం సృష్టించారు. మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు. అగ్నిపథ్ రద్దు చేసి యధాతధంగా పరీక్షలు నిర్వహించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.


Tags:    

Similar News