ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు.. చచ్చేలా కొట్టారు..!

బిర్యానీలోకి ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు ఓ కస్టమర్‌ను చితక బాదారు హోటల్‌ ఓనర్‌, అతని స్టాఫ్‌. ఆ దెబ్బలు తాళలేక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఆ అభాగ్యుడు, పోలీసులతో మాట్లాడుతూ కుప్పకూలి, కన్పుమూశాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని పంజాగుట్టలో జరిగింది. స్థానికంగా ఉన్న మెరిడియన్‌ రెస్టారెంట్‌కు ఆదివారం మధ్యాహ్నం లికాయత్‌ అనే వ్యక్తి భోజనానికి వెళ్లాడు

Update: 2023-09-11 15:50 GMT

బిర్యానీలోకి ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు ఓ కస్టమర్‌ను చితక బాదారు హోటల్‌ ఓనర్‌, అతని స్టాఫ్‌. ఆ దెబ్బలు తాళలేక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఆ అభాగ్యుడు, పోలీసులతో మాట్లాడుతూ కుప్పకూలి, కన్నునుసాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని పంజాగుట్టలో జరిగింది. స్థానికంగా ఉన్న మెరిడియన్‌ రెస్టారెంట్‌కు ఆదివారం మధ్యాహ్నం లికాయత్‌ అనే వ్యక్తి భోజనానికి వెళ్లాడు. బిర్యానీలోకి ఎక్స్‌ట్రా పెరుగు కావాలని అక్కడి స్టాఫ్‌ను అడిగాడు. పెరుగు ఎక్స్‌ట్రా ఇవ్వడానికి హోటల్‌ సిబ్బంది నిరాకరించారు. నికాయత్‌ వాళ్లతో వాగ్వాదానికి దిగాడు.

ఆర్గ్యుమెంట్‌ కాస్తా ఘర్షణకు దారి తీయడంతో హోటల్‌ ఓనర్‌, సిబ్బంది నికాయత్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి బాధితుడ్ని, హోటల్‌ ఓనర్ని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. జరిగిన సంఘటనను పోలీసులకు వివరిస్తూ నికాయత్‌ కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని డెక్కన్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. విషయం తెలిసిన ఏఐఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్‌ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితులను శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

Tags:    

Similar News