చంద్రబాబుకు కరోనా పాజిటివ్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు

Update: 2022-01-18 02:49 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో చంద్రబాబు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈపరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హోం ఐసొలేషన్ లోనే ఉండి చికిత్స పొందుతున్నట్లు చంద్రదబాబు తెలిపారు. తనతో వారం రోజుల నుంచి కాంటాక్ట్ అయిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు.

ఇటీవల వివిధ కార్యక్రమాల్లో....
చంద్రబాబు ఇటీవల వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాచర్లలో టీడీపీ నేత చంద్రయ్య హత్యకు గురయితే అక్కడకు వెళ్లి పాడె మోశారు. నిన్న ఆయన కుమారుడు లోకేష్ కూడా కరోనా బారిన పడ్డారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్వల్ప లక్షణాలే ఉన్నాయని చంద్రబాబు తెలిపారు.


Tags:    

Similar News