హైదరాబాద్ పోలీసులకు కరోనా భయం

హైదరాబాద్ పోలీసు శాఖను కరోనా కలకలం సృష్టిస్తుంది. . హైదరాబాద్ పోలీసు అధికారులకు భారీ ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. . ఇప్పటికే కరోనా బారినపడి [more]

Update: 2020-06-12 14:15 GMT

హైదరాబాద్ పోలీసు శాఖను కరోనా కలకలం సృష్టిస్తుంది. . హైదరాబాద్ పోలీసు అధికారులకు భారీ ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. . ఇప్పటికే కరోనా బారినపడి కానిస్టేబుల్ దయాకర్ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలంటూ డిజిపి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో బంజారాహిల్స్ లోని డ్యూటీ చేస్తున్న ఒక అధికారికి కరోనా వచ్చింది. మూడు రోజుల్లో ఒక్క బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లోనే 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పోలీస్ స్టేషన్ లో 15 మంది కరోనా రావడం ఇదే ప్రథమం. కానీ మొదటిసారి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో 15 మంది అధికారులకు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్లంతా ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News