హాట్ హాట్ గా సీడబ్ల్యూసీ … రాహుల్ అసహనం

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా సాగుతోంది. సోనియా గాంధీ ఆరోగ్యం బాగా లేని సమయంలో సీనియర్ నేతలు లేఖ రాయడంపై రాహుల్ గాంధీ [more]

Update: 2020-08-24 07:39 GMT

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా సాగుతోంది. సోనియా గాంధీ ఆరోగ్యం బాగా లేని సమయంలో సీనియర్ నేతలు లేఖ రాయడంపై రాహుల్ గాంధీ సూటిగానే సమావేశంలో ప్రశ్నించారు. అసహనం వ్యక్తం చేశారు. కపిల్ సిబాల్, గులాం నబీ ఆజాద్ లపై నేరుగా రాహుల్ విమర్శలు చేసినట్లు తెలిసింది. అయితే దీనికి సీనియర్ నేతలు ఘాటుగానే సమాధానమిచ్చారు. తమకు బీజేపీ నేతలతో సంబంధాలున్నాయని నిరూపిస్తే రాజీనామా చేస్తానని గులాం నబీ ఆజాద్ అన్నట్లు తెలిసింది. ముప్ఫయి ఏళ్లుగా తాము పార్టీ కోసం పనిచేస్తున్నామని కపిల్ సిబాల్ చెప్పినట్లు తెలిసింది. తమకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే రాజకీయంగా ఎదిగిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని రాహుల్ ఘాటుగానే సీనియర్ నేతలకు చురకలంటించారు.

Tags:    

Similar News