చోటా కె. నాయుడు సోదరుడి వ్యవహారంలో మరో ట్విస్ట్

ప్రముఖ కెమెరామెన్ చోటా కె.నాయుడు సోదరుడు శ్యాం కె నాయుడు కేసులో కొత్త మలుపు తిరిగింది . ఇప్పటికే శ్యాం కె నాయుడు నీ పోలీసులు అరెస్టు [more]

Update: 2020-07-28 13:35 GMT

ప్రముఖ కెమెరామెన్ చోటా కె.నాయుడు సోదరుడు శ్యాం కె నాయుడు కేసులో కొత్త మలుపు తిరిగింది . ఇప్పటికే శ్యాం కె నాయుడు నీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. శ్యాం కె నాయుడు వ్యవహారంలో ఇప్పుడు మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది . ఎస్.ఆర్.నగర్ పోలీస్ ఇన్స్ పెక్టర్ తన దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని తగిన విధంగా న్యాయం చేయలేదని ఏసీబీ అధికారులను నటి శ్రీ సుధా ఆశ్రయించింది. తాను ఎస్.ఆర్.నగర్ ఇన్స్ పెక్టర్ మురళికి ఐదు లక్షల వరకు డబ్బులు ఇచ్చానని, తర్వాత పోలీసులు శ్యాం కె నాయుడుపై కేసు నమోదు చేశారని ఆరోపిస్తుంది. ఇందుకు తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని, దీనికి సంబంధించి ఏసీబీ అధికారులను కలిసి ఇచ్చానని వెల్లడించింది. అంతేకాకుండా ఆడియో రికార్డ్స్ కూడా తన వద్ద ఉన్నాయని శ్రీ సుధా వెల్లడించింది. శ్యాం కె నాయుడు, శ్రీ సుధా మధ్య వ్యవహారం నడిచింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఉన్న వివాదం కాస్తా పోలీస్ స్టేషన్ వరకూ ఎక్కింది. చివరకు పోలీసులు కేసు నమోదు చేశారు అరెస్టు చేసి శ్యాం కె నాయుడు రిమాండ్ కు తరలించారు. తర్వాత శ్రీ సుధా తనకు కాంప్రమైజ్ అయిందని శ్యాం కె నాయుడు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శ్రీ సుధా కోర్టును ఆశ్రయించింది. శ్యామ్ కె నాయుడు పై కేసు నమోదు చేయాలంటూ కోర్టు ఎస్.ఆర్.నగర్ పోలీసులను ఆదేశించింది. పోలీసులు తన దగ్గర ఐదు లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని న్యాయం చేయలేదంటూ ఏసీబీ అధికారులను శ్రీ సుధా ఆశ్రయించడం సంచలనం సృష్టిస్తుంది.

Tags:    

Similar News