అఖిల తెలుసుకోవల్సింది చాలా ఉంది

మంత్రి అఖిలప్రియ నేర్చుకోవాల్సిందీ, తెలుసుకోవాల్సిందీ చాలా ఉందని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. ఇటీవల మంత్రి అఖిలప్రియ తన గన్ మెన్లను వెనక్కు పంపిన సంగతి తెలిసిందే. పోలీసు [more]

Update: 2019-01-09 07:47 GMT

మంత్రి అఖిలప్రియ నేర్చుకోవాల్సిందీ, తెలుసుకోవాల్సిందీ చాలా ఉందని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. ఇటీవల మంత్రి అఖిలప్రియ తన గన్ మెన్లను వెనక్కు పంపిన సంగతి తెలిసిందే. పోలీసు అధికారులు తన అనుచరుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారని మంత్రి అఖిలప్రియ అలిగి గన్ మెన్లను వెనక్కు పంపారు. దీనిపై కొద్దిసేపటి క్రితం హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. అఖిలప్రియ కార్టన్ సెర్చ్ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకొచ్చి ఉంటే బాగుండేందని, తనంతట తాను గన్ మెన్లను వెనక్కు పంపడం బాగాలేదని చినరాజప్ప అభిప్రాయపడ్డారు. అఖిలప్రియ విషయం చంద్రబాబు కు తెలిసిందని, ఆయన ఈ సమస్యను పరిష్కరిస్తారని రాజప్ప మీడియాకు వివరించారు.

Tags:    

Similar News