టీడీపీ వెంటే బీసీలు
బీసీ ల అభివృద్ధికి కృషి చేసింది టీడీపీ మాత్రమేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం వెంటే బీసీలు ఉంటారన్నారు. తొలి నుంచి టీడీపీ మాత్రమే [more]
బీసీ ల అభివృద్ధికి కృషి చేసింది టీడీపీ మాత్రమేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం వెంటే బీసీలు ఉంటారన్నారు. తొలి నుంచి టీడీపీ మాత్రమే [more]
బీసీ ల అభివృద్ధికి కృషి చేసింది టీడీపీ మాత్రమేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం వెంటే బీసీలు ఉంటారన్నారు. తొలి నుంచి టీడీపీ మాత్రమే బీసీల అభివృద్ధికి పాటుపడిందన్నారు చంద్రబాబు. ఆయన బీసీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రామ స్థాయిలో బీసీ నాయకత్వాన్ని పటిష్టపర్చేందుకు కృషి చేయాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ బీసీల కోసం తెచ్చిన వివిధ పథకాలను జగన్ రద్దు చేశారని చంద్రబాబు ఆరోపించారు. దాదాపు 35 పథకాలను రద్దు చేసి జగన్ రెడ్డి బీసీ ద్రోహిగా మారారన్నారు. బీసీ జనగణనలోనూ జగన్ వివక్ష చూపుతున్నారని చంద్రబాబు అన్నారు. బీసీలంతా టీడీపీ వైపు ఉండేలా చూడాలని చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు.