జగన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిందే
లాక్ డౌన్ లోనూ వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మద్యం షాపులను తెరిచి వైరస్ వ్యాప్తికి కారణమయ్యారన్నారు. [more]
లాక్ డౌన్ లోనూ వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మద్యం షాపులను తెరిచి వైరస్ వ్యాప్తికి కారణమయ్యారన్నారు. [more]
లాక్ డౌన్ లోనూ వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మద్యం షాపులను తెరిచి వైరస్ వ్యాప్తికి కారణమయ్యారన్నారు. లాక్ డౌన్ స్ఫూర్తినే దెబ్బతీశారన్నారు. పేద కుటుంబాలు ఒక్కొక్కరికీ ఐదు వేలు చొప్పున ఇవ్వాలని తాము డిమాండ్ చేసినా ప్రభుత్వానికి మనసు రాలేదన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటి వరకూ కరెంట్ ఛార్జీలు పెంచలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై అదనపుభారం మోపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ విషయంలో నిర్ణయం తీసుకుంది ఏపీని చూసేనని చంద్రబాబు చెప్పారు. తాను అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ సంస్కరణల్లో దేశంలోనే ఏపీని ముందంజలో ఉంచానన్నారు. విద్యుత్తు ఛార్జీలు పెంచి వైసీపీ ప్రభుత్వం బుకాయిస్తుందన్నారు. సోలార్ విద్యుత్తు విషయంలో తానే ప్రపంచానికి ఆదర్శంగా నిలిచానని చెప్పారు. ఉన్మాదులు రాజ్యమేలితే ఇలానే ఉంటుందన్నారు. ప్రజలకు వైసీపీ క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి విశ్వసనీయత లేదని చెప్పారు. ఫ్యాన్ కు ఓటేస్తే భవిష్యత్ ఉంటుందని చెప్పి అధికారంలోకి వచ్చి ఫ్యాన్ ను తిరగకుండా చేస్తున్నారన్నారు. మంత్రులకు కూడా సబ్జెక్ట్ లేదని చెప్పారు.