వైసీపీ నేతల లెక్కలు తేలుస్తా

విశాఖపట్నంకు బయలుదేరే ముందు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ నేతల లెక్కలు విశాఖలో తేల్చుతానని ఈ సందర్భంగా చెప్పారు. తాను విశాఖపట్నం [more]

Update: 2020-02-27 04:53 GMT

విశాఖపట్నంకు బయలుదేరే ముందు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ నేతల లెక్కలు విశాఖలో తేల్చుతానని ఈ సందర్భంగా చెప్పారు. తాను విశాఖపట్నం బయలుదేరుతానని తెలిసి వీర్రాజు చెరువు వద్ద రోడ్డును తవ్వారని చంద్రబాబు అన్నారు. తన పర్యటనపై ఆంక్షలు విధించడమేంటని ప్రశ్నించారు. విశాఖలో వైసీపీ నేతలు చేస్తున్న దోపిడీని ఎండగడతానని చెప్పారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను వైసీపీ దెబ్బతీస్తుందని ఆయన అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాను విశాఖ ప్రజల పక్షాన నిలుస్తాననిచెప్పారు. తన పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

Tags:    

Similar News