నీ రాక కోసం.. నిలువెల్ల కనులై..!

జనసేనతో పొత్తు, ప్రశాంత్‌ కిశోర్‌తో వ్యూహాలు, మెజారిటీ మీడియా మద్దతు.. ఇన్ని ఉన్నా చంద్రబాబు నాయుడు భాజపాతో పొత్తు కోసం తహతహలాడుతున్నారు. ప్రస్తుతం దేశంలో మోదీ హవా నడుస్తుండటం, 2024లో కూడా కమలం పార్టీనే కేంద్రంలో అధికారం చేపడుతుందని సర్వేలు చెబుతుండటంతో ఆయన మోదీ మీద ఆశలు వదులుకోలేకపోతున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే 2014లో లాగా మళ్లీ అధికారంలోకి రావచ్చని తెదేపా అధినేత భావిస్తున్నారు.

Update: 2023-12-24 16:30 GMT

chandrababu

ఆ మేజిక్ రిపీట్ చేయాలని చంద్రబాబు తహతహ

జనసేనతో పొత్తు, ప్రశాంత్‌ కిశోర్‌తో వ్యూహాలు, మెజారిటీ మీడియా మద్దతు.. ఇన్ని ఉన్నా చంద్రబాబు నాయుడు భాజపాతో పొత్తు కోసం తహతహలాడుతున్నారు. ప్రస్తుతం దేశంలో మోదీ హవా నడుస్తుండటం, 2024లో కూడా కమలం పార్టీనే కేంద్రంలో అధికారం చేపడుతుందని సర్వేలు చెబుతుండటంతో ఆయన మోదీ మీద ఆశలు వదులుకోలేకపోతున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే 2014లో లాగా మళ్లీ అధికారంలోకి రావచ్చని తెదేపా అధినేత భావిస్తున్నారు.

2014లో కూడా వైకాపా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. మోదీ, పవన్‌ని తమ కూటమిలోకి తెచ్చుకోవడం ద్వారా, కేవలం నెల్లాళ్లలో పరిస్థితిని చంద్రబాబు తారుమారు చేశారు. అప్పుడు వీస్తున్న మోదీ హవా, పవన్‌ ఇమేజ్‌ తెలుగుదేశానికి ఎంతో ఉపయోగపడ్డాయి. 20 సీట్లు తారుమారై చంద్రబాబును అవశేష ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిని చేశాయి. 2019లో భాజపాను ఆయన వీడితే, పవన్‌ సొంతంగా పోటీ చేశారు. ఎన్నికల్లో మూడు పార్టీలూ చతికిలపడ్డాయి. జనసేన ఒక్కసీటు గెలుచుకుంటే, భాజపా ఏపీలో ఖాతా కూడా తెరవలేకపోయింది.

రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉండాల్సి రావడం, కేంద్రంలో తమకు అనుకూలమైన ప్రభుత్వం లేకపోవడంతో నాలుగేళ్లుగాచంద్రబాబు చాలా ఇబ్బందులు పడ్డారు. చివరకు జైలుకు వెళ్లాల్సి కూడా వచ్చింది. భాజపాతో కలిసి ఉంటే తమ అధినేతను అరెస్ట్‌ అయ్యే అవకాశం ఉండేది కాదని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాలు, పవన్‌కు యువతలో ఉన్న ఫాలోయింగ్‌ మాత్రమే తమను గట్టెంచిక్కలేకపోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే భాజపాతో దోస్తీకి బాబు తాపత్రయపడుతున్నారు. అవసరమైతే మరో నాలుగైదు ఎంపీ సీట్లు ఎక్కువ ఇచ్చి అయినా సరే.. ఎన్డీయే కూటమిలోకి చేరుదామనేది ఆయన ఆలోచన.

దక్ష్షిణాదిలో కొంతయినా పట్టు సంపాదిద్దామని భాజపా ఆలోచన. అందుకే ఎమ్మెల్యే సీట్లను తక్కువ తీసుకుని ఓ పది వరకైనా ఎంపీ సీట్లు కావాలని ఆ పార్టీ తెలుగుదేశంతో బేరం పెట్టవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏ పార్టీకైనా అధికారమే పరమావధి కాబట్టి బేరసారాలు ఓ కొలిక్కి రావచ్చనే నమ్మకంతో... ఇరుపార్టీలకు చెందిన మధ్యవర్తులు ఉన్నారు. ఇదే జరిగితే ఆనాటి చెలిమి మళ్లీ చిగురుస్తుంది. నాటి మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందో.. లేదో.. కాలమే చెప్పాలి.

Tags:    

Similar News