ఈయన చెప్పిందే వేదమట

చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఒక్క కాల్వ శ్రీనివాసులుకు మాత్రమే నిర్ణయాధికారం ఇచ్చినట్లు కనపడుతుంది.

Update: 2022-03-21 02:25 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి కొందరు నేతలనే నమ్ముతున్నట్లు కనపడుతుంది. అనంతపురం జిల్లాలో పార్టీ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అక్కడ కమ్మ, రెడ్డి సామాజికవర్గాలు ఆధిపత్యం కోసం పట్టుబడుతున్నాయి. జేసీ బ్రదర్స్ దారి వేరు. జేసీ బ్రదర్స్ ను పరిటాల, ప్రభాకర్ చౌదరి వంటి నేతలు వ్యతిరేకిస్తున్నారు. వారు తమ నియోజకవర్గాలకే పరిమితమవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అనంతపురం జిల్లాలో కాల్వ శ్రీనివాసులుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనపడుతుంది.

సాలిడ్ ఓటు బ్యాంకు...
అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో కేవలం రెండే స్థానాలు వచ్చాయి. వచ్చే ఎన్నికలలో కొద్దోగొప్పో రాయలసీమ జిల్లాల్లో సీట్లు గెలుచుకునే అవకాశం ఒక్క అనంతపురం జిల్లాలోనే చంద్రబాబుకు ఎక్కువగా కన్పిస్తుంది. ఇక్కడ పార్టీ క్యాడర్ బలంగా ఉండటమే కాకుండా, ఓటు బ్యాంకు కూడా సాలిడ్ గా టీడీపీకి ఉంది. అందుకే చంద్రబాబు ఈ జిల్లాలో ఎక్కువగా రిస్క్ చేయడానికి ఇష్టపడటం లేదు. కాల్వ శ్రీనివాసులు అయితే అందరినీ సర్దుబాటు చేసుకుంటూ వెళతారని నమ్ముతున్నారు.
అనేక నియోజకవర్గాల్లో...
శింగనమల నియోజకవర్గంలోనూ దళితులకు, అగ్రవర్ణాలకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. అక్కడ రెండు గ్రూపులున్నాయి. ఇక కల్యాణదుర్గం నియోజకవర్గంలోనూ టీడీపీ లో రెండు గ్రూపులు బలంగా ఉన్నాయి. పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె రఘునాధరెడ్డి, జేసీ వర్గాల మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది. పెనుకొండలోనూ నిమ్మల కిష్టప్ప, బీకే పార్థసారధి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. అనంతపురం టౌన్ లోనూ ప్రభాకర్ చౌదరి, జేసీ వర్గాలు సమయం కోసం వేచిచూస్తున్నట్లే కనపడుతున్నాయి. వీటన్నింటిని త్వరలోనే సెట్ రైట్ చేయాల్సి ఉంది.
కాల్వతోనే సంప్రదింపులు...
అందుకే ఎవరికి చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఒక్క కాల్వ శ్రీనివాసులుకు మాత్రమే నిర్ణయాధికారం ఇచ్చినట్లు కనపడుతుంది. ఆయన ద్వారానే చంద్రబాబు ఎప్పటికప్పుడు జిల్లా రాజకీయాలను తెలుసుకుంటున్నారు. కాల్వ శ్రీనివాసులుకు అధినేత ప్రయారిటీ ఇవ్వడం చూసిన కొందరు నేతలు ఆయనకు దగ్గరవుతుండగా, మరికొందరు కాల్వపై నిప్పులు చెరుగుతున్నారు. మొత్తం మీద అనంతపురం టీడీపీలో కాల్వ శ్రీనివాసులు కీలకంగా మారారనే చెప్పాలి.


Tags:    

Similar News