నదీ జలాలపై కేంద్రం కీలక నిర్ణయం

నదీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధులను ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ [more]

Update: 2021-07-16 03:37 GMT

నదీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధులను ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ ను విడుదల చేసది. అక్టోబరు 14వ తేదీ నుంచి ఈ గెజిట్ నోటిఫికేషన్ అమలులోకి రానుంది. కృష్ణా నదిపై 36, గోదావరి నదిపై 71 ప్రాజెక్టులను ఈ బోర్డు పరిధిలోకి తెస్త గెజిట్ ను విడుదల చేసింది. అనుమతులు లేని ప్రాజెక్టులను నిలిపేయాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. అనుమతులు లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతులు తెచ్చుకోవాలని సూచించింది. ప్రాజెక్టుల నిర్వహణ బోర్డులే చూసుకుంటాయని స్పష్టం చేసింది. ఒక్కొక్క బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

Tags:    

Similar News