రెండేళ్ల పాటు వాటికి బ్రేక్ ఇచ్చిన కేంద్రం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. ప్రధానంగా పార్లమెంటు సభ్యులకు ఇచ్చే నిధులను రెండేళ్ల పాటు నిలిపివేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి [more]

Update: 2020-04-06 12:44 GMT

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. ప్రధానంగా పార్లమెంటు సభ్యులకు ఇచ్చే నిధులను రెండేళ్ల పాటు నిలిపివేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పార్లమెంటు సమావేశంలో చట్టం చేయాల్సి ఉన్నా అది కుదరకపోవడంతో దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించింది. అలాగే ప్రధాని తో పాటు మంత్రుల జీతాల్లో కోత విధించాలని నిర్ణయించింది. మంత్రులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తమ విరాళాలను స్వచ్ఛందంగా ఇవ్వవచ్చని కేంద్ర మంత్రివర్గం అభిప్రాయపడింది. ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత విధించాలని నిర్ణయించింది. లాక్ డౌన్ విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి వర్గం అభిప్రాయపడింది.

Tags:    

Similar News