విపక్షాల కూటమికి ఎదురుదెబ్బ

వీవీప్యాట్లు, కౌంటింగ్ విధానంలో మార్పులు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్న విపక్షాల కూటమికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలని, ముందు [more]

Update: 2019-05-22 09:06 GMT

వీవీప్యాట్లు, కౌంటింగ్ విధానంలో మార్పులు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్న విపక్షాల కూటమికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలని, ముందు వీవీప్యాట్లను లెక్కించాకే ఈవీఎంలను లెక్కించాలని, ఈవీఎంలు, వీవీప్యాట్ల స్లిప్పుల్లో తేడా ఉంటే మొత్తం అన్ని వీవీప్యాట్లను లెక్కించాలనే డిమాండ్ తో కాంగ్రెస్, తెలుగుదేశం సహా 21 పార్టీలు పోరాడుతున్నాయి. ఈ మేరకు నిన్న ఈ పార్టీల ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిశారు. అయితే, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో మార్పు ఏమీ చేయడం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నియోజకవర్గానికి 5 వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కిస్తామని ఈసీ క్లారిటీ ఇచ్చింది.

Tags:    

Similar News