ఎన్నికలు.. గెలుపు.. అదే టార్గెట్

నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరబాద్ లో జరుగుతున్నాయి.

Update: 2022-07-02 02:39 GMT

నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరబాద్ లో జరుగుతున్నాయి. రెండురోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులతో పాటు జాతీయ స్థాయి నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇప్పటికే కొందరు జాతీయ నేతలు హైదరాబా్ చేరుకున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో పార్టీ పురోగతి పై నేతలు చర్చించనున్నారు. ఇందుకోసం అజెండాలో అనేక అంశాలను రూపొందించారు.

కీలక నిర్ణయాలు..
జాతీయ స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన విధానంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. వచ్చే ఏడాది జరగననున్న వివిధ రాష్ట్రాల ఎన్నికలు, 2024 లోక్‌ సభఎన్నికలు, పార్టీ విస్తరణ వంటి వాటిపై కూలంకషంగా చర్చించనున్నారు. వీటిపై చర్చించి బీజేపీకి రూట్ మ్యాప్ ను ఈ సమావేశాల్లోనే నిర్ణయించనున్నారు. వీటిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని బీజేపీ సీనియర్ నేతలు చెబుతున్నారు.
ఎన్నికలు జరిగే...
ఇప్పటకే రెండు సార్లు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింంది. భారత్ లోని అత్యధిక రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో అది బీజేపీ ఖాతాలో పడేలా వ్యూహాలను రచించనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ లోనూ రెండోసారి అధికారం దక్కించుకున్న బీజేపీ త్వరలో జరగనున్న గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికలపై ఈ సమావేశాల్లో ముఖ్యంగా చర్చించనుంది. దక్షిణాదిలో బీజేపీని బలోపేతం చేసే అంశంపై కూడా ప్రధానంగా చర్చించనుంది.


Tags:    

Similar News