జగన్ పై రాంమాధవ్…?

రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని, వాటివల్ల ప్రజల సమస్యలు తీరవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో జరిగిన [more]

Update: 2019-07-24 07:45 GMT

రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని, వాటివల్ల ప్రజల సమస్యలు తీరవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో జరిగిన పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో రాంమాధవ్ పాల్గొన్నారు. బీజేపీ వల్లనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదని, ఇప్పుడు జగన్ పాలన కూడా దానికి తీసిపోని విధంగా ఉందన్నారు. ఏపీ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుందన్నారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తామని రాంమాధవ్ తెలిపారు.

Tags:    

Similar News