పోలీసుల కళ్లుగప్పి అమలాపురానికి చేరుకున్నా….

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేస్తున్నారు. చలో అమలాపురం పిలుపునివ్వడంతో అరెస్ట్ లు నిన్నటి నుంచి కొనసాగుతున్నాయి. సోము వీర్రాజు, కన్నా [more]

Update: 2020-09-18 02:32 GMT

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేస్తున్నారు. చలో అమలాపురం పిలుపునివ్వడంతో అరెస్ట్ లు నిన్నటి నుంచి కొనసాగుతున్నాయి. సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలను నిన్ననే హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ నేత విష్ణువర్ణన్ రెడ్డిని నిన్న అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేతల ఇళ్ల వద్దనే అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. అమలాపురంలో 144 సెక్షన్ అమలులో ఉండటంతో చలో అమలాపురం కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించాలని సోము వీర్రాజుపిలుపునిచ్చారు. పోలీసుల కళ్లుగప్పి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అమలాపురానికి చేరుకున్నారు. ఆయనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ అరెస్ట్ లను ఖండిస్తున్నామని సోము వీర్రాజు తెలిపారు.

Tags:    

Similar News