చార్మినార్ ప్రాంతంలో టెన్షన్.. బండి సంజయ్

చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద బిజెపి ఓ కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నం చేస్తుంది.. ఇప్పటికే బండి సంజయ్ ఈ మేరకు పిలుపునిచ్చారు. చార్మినార్ సాక్షిగా ప్రమాణం చేసేందుకు [more]

Update: 2020-11-20 02:03 GMT

చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద బిజెపి ఓ కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నం చేస్తుంది.. ఇప్పటికే బండి సంజయ్ ఈ మేరకు పిలుపునిచ్చారు. చార్మినార్ సాక్షిగా ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అంతేకాకుండా వరద సహాయాన్ని తాము అడ్డుకున్నామని వచ్చిన వార్తలపై బండి సంజయ్ ఆగ్రహంతో ఉన్నారు. తన పేరుతో విడుదలైన లేఖ కు సంబంధించి తాను ఎలాంటి ప్రమాణాల కు సిద్ధమని బండి సంజయ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.. ఇప్పటికే దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అయితే భాగ్యలక్ష్మి దేవాలయం లో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఇదిలా ఉంటే భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద ఎలాంటి రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు అంటున్నా.రు. ఇక్కడ అనుమతి కావాలంటే ఎవరు కూడా తమ కు దరఖాస్తు చేసుకోలేదని చెప్తున్నారు. అనుమతులు లేకుండా ఎవరైనా రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అయితే నేడు శుక్రవారం కావడంతో మక్కామసీదులో పెద్ద ఎత్తున ప్రార్థన కోసం వస్తుంటారు. నేపథ్యంలో రేపు ఒక టెన్షన్ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలాంటి రాజకీయ కార్యక్రమాలకు అనుమతించే ప్రసక్తే లేదని పోలీసులు కరాఖండిగా చెబుతున్నారు.

Tags:    

Similar News