వారిని తెలంగాణ నుంచి తరిమేంత వరకూ?
తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన లేదని, కుటుంబ పాలన మాత్రమే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికే ప్రజాసంగ్రామ పాదయాత్ర [more]
తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన లేదని, కుటుంబ పాలన మాత్రమే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికే ప్రజాసంగ్రామ పాదయాత్ర [more]
తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన లేదని, కుటుంబ పాలన మాత్రమే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికే ప్రజాసంగ్రామ పాదయాత్ర చేపట్టానన్నారు. రైతుల పరిస్థితి రాష్ట్రంలో అగమ్య గోచరంగా ఉందన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలేదన్నారు. దళితులను వంచించిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. దళితులను ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదన్నారు. దళితులకు మూడు ఎకరాలు ఇస్తానన్న హామీ ఏమయిందని బండి సంజయ్ ప్రశ్నించారు. లక్ష పంట రుణమాఫీని ఏం చేశారని బండి సంజయ్ నిలదీశారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బండి సంజయ్ తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారం నుంచి కూలదోయాలని ఆయన అన్నారు. వేల ఎకరాలు అమ్ముకుంటున్న కేసీఆర్ దళితులకు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదన్నారు. తాము 80 శాతం హిందువుల కోసమే పనిచేస్తామని బండి సంజయ్ చెప్పారు. తాలిబన్లను సమర్థించిన వారిని తెలంగాణ నుంచి తరిమి కొడతామని తెలిపారు.