బండి సంజయ్ యాత్ర నేటి నుంచి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేటి నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్టోబరు 2వ తేదీ వరకూ ఈ యాత్ర సాగనుంది. దీనికి ప్రజా సంగ్రామ [more]

Update: 2021-08-28 02:41 GMT

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేటి నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్టోబరు 2వ తేదీ వరకూ ఈ యాత్ర సాగనుంది. దీనికి ప్రజా సంగ్రామ యాత్ర గా నామకరణం చేశారు. హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ఈ పాదయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. రోజుకు కనీసం పది కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని బండి సంజయ్ భావిస్తున్నారు. పాదయాత్రలో ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. పాదయాత్ర కోసం బీజేపీ పెద్దయెత్తున ఏర్పాట్లు చేసింది. పోలీసులు కూడా పెద్దయెత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News