కేసీఆర్ జగన్ కు అమ్ముకున్నది నిజమే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ కు నీళ్లు అమ్ముకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. 575 [more]

Update: 2021-07-06 07:59 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ కు నీళ్లు అమ్ముకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. 575 టీఎంసీలు తెలంగాణకు రావాల్సి ఉంటే 299 టీఎంసీలకు పరిమితమై కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని బండి సంజయ్ విమర్శలు చేశారు. అపెక్స్ కమిటీ వద్ద ఎందుకు అంగీకరించాల్సి వచ్చిందో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. కేవలం ఉప ఎన్నికలు వచ్చినప్పుడే నీళ్ల సమస్య కేసీఆర్ కు గుర్తుకు వస్తుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News