బ్రేకింగ్: వరంగల్ జిల్లాలో దారుణం

ప్రేమోన్మాధులు రెచ్చిపోతున్నారు. తమను కాదన్న అమ్మాయిలపై పగ పెంచుకుని దాడులకు పాల్పడుతున్నారు. మొన్న హైదరాబాద్ లో ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడి చేసిన ఉదంతం మరువకముందే వరంగల్ [more]

Update: 2019-02-27 06:07 GMT

ప్రేమోన్మాధులు రెచ్చిపోతున్నారు. తమను కాదన్న అమ్మాయిలపై పగ పెంచుకుని దాడులకు పాల్పడుతున్నారు. మొన్న హైదరాబాద్ లో ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడి చేసిన ఉదంతం మరువకముందే వరంగల్ లో ఇటువంటి దాడే జరిగింది. తనను ప్రేమించలేదనే కోపంతో అవినాష్ అనే యువకుడు ఇవాళ ఉదయం హన్మకొండ నయీంనగర్ లో డిగ్రి విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన అమ్మాయిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. వరంగల్ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన విద్యార్థిని హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలతో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. గత కొంతకాలంగా తనను ప్రేమించాలని అమ్మాయిని అవినాష్ వేదిస్తున్నట్లు తెలిసింది. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

Tags:    

Similar News