ఆశారాం బాపూకు జీవిత ఖైదు విధించింది జోధ్ పూర్ కోర్టు. బాలికపై అత్యాచారం కేసులో ఆశారాం బాపూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో దోషిగా తేల్చిన జోధ్ పూర్ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఆశారాం బాపూ అనుచరులు ఇద్దరికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాగా ఆశారాం బాపూ2013 నుంచి జైలులోనే ఉంటున్నారు. ఆశారాం బాపూపై మూడు కేసులున్నాయి. జీవిత ఖైదు విధించడంతో బాపూ జీవిత చరమాంకంలో జైలులోనే ఎక్కువ కాలం గడపాల్సి ఉంటుంది.