డ్రామాలు ఆపండి… ఈవెంట్ మేనేజ్ మెంట్ కాదు

దేశం ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ కాదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. దేశ ప్రజలకు కూడా కొన్ని ఆశలు, ఆకాంక్షలు ఉంటాయన్నారు. వాటిని తొమ్మిది [more]

Update: 2020-04-03 12:22 GMT

దేశం ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ కాదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. దేశ ప్రజలకు కూడా కొన్ని ఆశలు, ఆకాంక్షలు ఉంటాయన్నారు. వాటిని తొమ్మిది నిమిషాల జిమ్మిక్కుల కోసం కుదించవద్దని ఒవైసీ అన్నారు. డ్రామాలు కట్టిపెట్టాలని ఒవైసీ ప్రధాని నరేంద్ర మోదీపై ఫైర్ అయ్యారు. ఇటువంటి జిమ్మిక్కులన ఆపి, ఈ క్లిష్ట సమయంలో రాష్ట్రాలకు ఎలాంటి సాయం చేయనున్నారో చెప్పాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. పేదలకు ఎలాంటి సాయం చేస్తారో చెప్పాలన్నారు. లక్షలాది మంది పేదలు దేశంలో ఆకలితో అలమటించి పోతున్నారన్నారు. తమ ఇళ్లకు వెళ్లేందుకు దేశంలో లక్షలాది మంది వలస కార్మికులు ఎదురు చూస్తున్నారని, వారి చేతిలో కొవ్వొత్తులు ఎలా వస్తాయని అసుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.

Tags:    

Similar News