స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరపలేం

స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరి నెలలో నిర్వహించలేమని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు పిటీషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ [more]

Update: 2020-12-02 02:30 GMT

స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరి నెలలో నిర్వహించలేమని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు పిటీషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పటికీ ఏపీలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగానే ఉన్నాయని, ఆరువేల మందికి పైగా మరణించారని, ప్రజారోగ్యం దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియను వెంటనే ఆపేయాలని పిటీషన్ లో ఏపీ ప్రభుత్వం హైకోర్టును కోరింది.

Tags:    

Similar News