ఈ ఏడాది అనుమతి లేదు.. తేల్చి చెప్పిన ఏపీ సర్కార్

వినాయక చవితి ఉత్సవాలను ఇంట్లోనే జరుపుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మండపాలకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. కరోనా వైరస్ కారణంగా ఈ నిర్ణయం [more]

Update: 2020-08-20 03:45 GMT

వినాయక చవితి ఉత్సవాలను ఇంట్లోనే జరుపుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మండపాలకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. కరోనా వైరస్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ వినాయక విగ్రహాలను ప్రతిష్టించకూడదని తెలిపింది. మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు ఇచ్చిన మార్గదర్శకాలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పూజా సామగ్రి కొనుగోలు సమయంలోనూ భౌతిక దూరం పాటించాలని పేర్కొంది. అయితే పరిమిత సంఖ్యలో వినాయక విగ్రహాలకు అనుమతి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హోంమంత్రికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News