కేబినెట్ స‌మావేశం వాయిదా

ఈ నెల 10వ తేదీన జ‌ర‌గాల్సిన కేబినెట్ స‌మావేశాన్ని 14వ తేదీకి వాయిదా వేస్తూ ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంకు [more]

Update: 2019-05-07 12:45 GMT

ఈ నెల 10వ తేదీన జ‌ర‌గాల్సిన కేబినెట్ స‌మావేశాన్ని 14వ తేదీకి వాయిదా వేస్తూ ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంకు సీఎంఓ నోట్ పంపించింది. దీంతో పాటు కేబినెట్ స‌మావేశం అజెండా కూడా సీఎస్ కు అంద‌జేసింది. ఫాని తుఫాను, క‌రువు, న‌రేగా కూలీలకు బిల్లుల చెల్లింపులో అవ‌రోధాలు వంటి అంశాల‌ను కేబినెట్ స‌మావేశంలో చ‌ర్చించనున్న‌ట్లు సీఎం ముఖ్య కార్య‌ద‌ర్శి సీఎస్ కు తెలిపారు. ఈ అజెండాలోని అంశాల‌ను ఆయా శాఖ‌ల కార్య‌ద‌ర్శుల‌కు సీఎస్ పంపించ‌నున్నారు. దీంతో పాటు కేబినెట్ భేటీ అజెండాను ఎన్నిక‌ల సంఘానికి కూడా పంపించాక‌.. ఈసీ ఆమోదం తెలిపిన త‌ర్వాత కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

Tags:    

Similar News