జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. జయరాం హత్య కేసులను తూతూమంత్రంగా విచారించిన నందిగామ పోలీసులు హైదరాబాద్ కు బదిలీ [more]

Update: 2019-02-15 07:15 GMT

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. జయరాం హత్య కేసులను తూతూమంత్రంగా విచారించిన నందిగామ పోలీసులు హైదరాబాద్ కు బదిలీ చేశారు. హైదరాబాద్ పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. జయరాంను చంపింది మొత్తం ముగ్గరని పోలీసుల విచారణలో తేలింది. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి… డ్రైవర్ శ్రీనివాస్, రౌడీషీటర్ నగేష్ మేనల్లుడు విశాల్ తో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. విశాల్ లైఫ్ సెటిల్ చేస్తానని జయరాం హత్యలో అతడిని రాకేష్ ఉపయోగించుకున్నాడు. కాగా, హత్య చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న రౌడీషీటర్ నగేష్ మాత్రం రాకేష్ రెడ్డి ఇంటి నుంచి ముందే వెళ్లిపోయాడు.

బయటకు వస్తున్న అసలు నిజాలు

ఈ కేసులో నిందితుడు రాకేష్‌రెడ్డి అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. జయరాం చనిపోతే ఆస్తులు వస్తాయని ప్లాన్ చేసి అతడిని హతమార్చినట్లు విచారణలో అంగీకరించాడు. జయరాం హత్యకు వారం ముందే స్కెచ్‌ వేసిన రాకేష్‌రెడ్డి… రూ.100 బాండ్‌ పేపర్లపై జయరాం సంతకాలు తీసుకున్నట్లు పోలీసులకు తెలిపాడు. జయరాంని దసపల్లా హోటల్ నుంచి వీణా మేడం డ్రైవర్‌నంటూ నటుడు సూర్య కార్‌లో తీసుకొచ్చినట్లు చెప్పాడు. జయరాంని హత్య చేస్తానని, హత్య చేస్తే ఆస్తులు వస్తాయని రాకేష్‌ నలుగురికి ముందే చెప్పినట్లు విచారణలో వెల్లడించాడు. ఈ కేసులో మొత్తం ఐదుగురిని నిందితులుగా చేర్చనున్నారు పోలీసులు. రేపు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి, జయరాం హత్య కేసు వివరాలను సీపీ తెలియజేస్తారు.

Tags:    

Similar News