బాలీవుడ్ లో విషాదం

సంగీత ప్రపంచంలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ హఠాన్మరణం చెందాడు.

Update: 2022-06-01 01:49 GMT

సంగీత ప్రపంచంలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ హఠాన్మరణం చెందాడు. దీంతో మ్యూజిక్ ప్రియుల్లో విషాదం ఏర్పడింది. ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. పాటలు పాడారు. అనంతరం గుండెపోటుతో మరణించారు. కేకే గా ఫేమస్ అయిన కృష్ణకుమార్ కున్నాత్ గుండెపోటుతో మరణించడాన్ని సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు.

లైవ్ షోలో పాల్గొని...
కోల్‌కత్తాలోని ఒక కళశాళాలలో జరిగిన కార్యక్రమంలో కృష్ణకుమార్ కున్నాత్ పాల్గొన్నారు. హమ్ దిల్ చుకే సనమ్ సినిమా లోని "ఐసా క్యా గుణ కియా" పాటతో ఆయన అందరికీ సుపరిచుతుడయ్యాడు. కృష్ణకుమార్ కున్నాత్ దాదాపు 200కు పైగా పాటలు పాడాదరు. ఓ షో నిర్వహిస్తుండగా ఆయన గుండెపోటుకు గురవ్వడంతో వెంటనే కోల్‌కత్తాలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించారు. కేకే వయసు 53 సంవత్సరాలు.
చిన్న వయసులోనే....
కృష్ణకుమార్ కున్నాత్ మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. బాలీవుడ్ నటులు అక్షయ్ం కుమార్ తో పాటు పలువురు సంగీత ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. కృష్ణకుమార్ కున్నాత్ 1999లో బాలివుడ్ లోని పాల్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. హిందీ, తెలుగు, తమిళ, మళయాళం, కన్నడ, బెంగాలీ తదితర భాషల్లో ఆయన అనేక పాటలు పాడి అందరినీ ఆకట్టుకున్నారు.


Tags:    

Similar News