చంద్రబాబుకు బిగ్ షాక్.. ఇల్లు అటాచ్

చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కరకట్టపై ఉన్న చంద్రబాబు గెస్ట్‌హౌస్ ను ఏపీ సీఐడి అటాచ్ చేసింది.

Update: 2023-05-14 06:36 GMT

చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కరకట్టపై ఉన్న చంద్రబాబు గెస్ట్‌హౌస్ ను ఏపీ సీఐడి అటాచ్ చేసింది. క్విడ్ ప్రోకోకు చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణ పాల్పడ్డారన్న అభియోగాలపై కేసు నమోదు చేసింది. క్విడ్ ప్రోకోలో భాగంగా లింగమనేని రమేష్ నుంచి గెస్ట్ హౌస్‌ను తీసుకున్నారన్న ఆరోపణలపై పలు సెక్షన్ల కింద ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. దీంతో లింగమనేని గెస్ట్ హౌస్‌ను అటాచ్ చేసింది.

క్విడ్ ప్రోకో...
రాజధాని ప్రాంతంలో లింగమనేని భూములకు మంచి ధర లభించేలా అలైన్‌మెంట్ మార్చారని ఆరోపణలు వచ్చాయి. లింగమనేనికి లబ్ది చేకూర్చినందుకు ఈ గెస్ట్ హౌస్‌ను తీసుకున్నారన్న అభియోగాలున్నాయి. ఈకారణంగా చిన్న చిన్న రైతులు నష్టపోయారని ప్రభుత్వం వాదిస్తుంది. 3.66 కోట్ల రూపాయలతో నారాయణ విద్యాసంస్థలలో పనిచేసిన ఒక వ్యక్తి బినామీ పేరు మీద కొనుగోలు చేశారని చెబుతుంది. ఏపీ సీఐడీ ఈ మేరకు చంద్రబాబు నివాసం ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్‌ను అచాచ్ చేసింది.


Tags:    

Similar News