ఉత్తరాంధ్రలో వలసలు ఇక ఉండవు

ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్ పోర్టు మరింత శోభాయమానంగా నిలుస్తుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

Update: 2023-05-03 06:32 GMT

ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్ పోర్టు మరింత శోభాయమానంగా నిలుస్తుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆయన భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఇరవై ఆరు నుంచి ముప్ఫయి నెలల్లోపు ఈ ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తవుతుందని జగన్ తెలిపారు. రెండు రన్ వేలతో ఏర్పాటవుతున్న ఈ భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన చేయడానికి కూడా కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అనేక రకాలుగా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారన్నారు. ఒకేసారి ఇరవై రెండు విమానాలు ఆగేలా, ఎగిరేలా ఎయిర్ పోర్టు రూపుదిద్దుకుంటుందని జగన్ తెలిపారు.

ఒకేసారి 22 విమానాలు...
అన్నింటినీ అధిగమించి, అన్నీ అనుమతులు తీసుకుని తాము శంకుస్థాపన చేశామని, ఇక భోగాపురం ఎయిర్ పోర్టు పనులు శరవేగంగా పూర్తవుతాయని జగన్ హామీ ఇచ్చారు. రైతుల సహకారంతో వేలాది ఎకరాలు తీసుకుని ఈ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయంపై త్వరలోనే విమానాలు ఎగిరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సాలూరులో డ్రైవర్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. వెనుకబడిన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నాని జగన్ తెలిపారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాను గమనించాలని కోరారు.
కిడ్నీ రీసెర్చ్ సెంటర్...
ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను కూడా త్వరలో జాతికి అంకితం చేస్తామని తెలిపారు. మరో రెండు నెలల్లోనే ఈ కార్యక్రమం పూర్తవుతుందని తెలిపారు. కిడ్నీ సమస్యలు తలెత్తకుండా ఇచ్ఛాపురం, పలాస వంటి ప్రాంతాల్లో రక్షిత తాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని జగన్ తెలిపారు. ఈ జూన్ నెలలోగా తాగు నీటి పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. విశాఖ అందరికీ ఆమోదయోగ్యమైన నగరమని జగన్ తెలిపారు. ఉత్తరాంధ్రలో వలసలు అరికట్టేందుకు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. తాను కూడా సెప్టంబరు నుంచి విశాఖలోనే కాపురం పెడతామని మరోసారి జగన్ తెలిపారు.


Tags:    

Similar News