ఇదే నా రాష్ట్రం... ఇక్కడే నా రాజకీయం

కమలాపురంలో జరిగిన బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించారు.

Update: 2022-12-23 11:37 GMT

చంద్రబాబు లాగా ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రమనో.. ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అనో తాను అనని అన్నారు. దత్తపుత్రుడిలాగా ఈ పెళ్లాం కాకపోతే ఇంకో పెళ్లాం అని కూడా అని అనని ఎద్దేవా చేశారు. ఇదే నా రాష్ట్రం.. ఇదే నా నివాసం. ఇక్కడే ఐదు కోట్ల మంది నా కుటుంబం.. ఇక్కడే నా రాజకీయం" అని జగన్ అన్నారు. లంచాలు లేకుండా పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. అందరికీ ఉద్యోగాలివ్వాలన్న తపనతో ముందడగు వేస్తున్నామని చెప్పారు. కమలాపురంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

కృష్ణా నది కడపకు వచ్చిందంటే...
కృష్ణా నది కడప జిల్లాకు వచ్చిందంటే అది వైఎస్సార్ పుణ్యమేనని అన్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి రైల్వే లైన్ కోసం 68 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కొప్పర్తిలో ఇండ్రస్ట్రియల్ పార్క్ పూర్తయితే రెండు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. వైఎస్సార్ దయతో కడప జిల్లాలో అన్ని ప్రాజెక్టుల పూర్తి చేసుకున్నామని తెలిపారు. 6,914 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామని జగన్ తెలిపారు. ప్రతి పేదవాడికి సాయం అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
వైఎస్సార్ వల్లనే ప్రాజెక్టులు...
ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయని మంచి చేసినవాడే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడని జగన్ అన్నారు. గతంలో పెన్షన్లు రావాలటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వలసిన పరిస్థితి లేదన్నారు. ప్రజల సంక్షేమమే తన థ్యేయమని జగన్ తెలిపారు. కమలాపురంలో 902 కోట్ల రూపాలయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. వైఎస్సార్ మరణం తర్వాత అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయని అన్నారు. మరో 18 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, తాను దేవుడిని, ప్రజలను మాత్రమే నమ్ముకున్నానని ఆయన తెలిపారు.


Tags:    

Similar News