యాంకర్ మృతి కేసులో ఆ ఫోన్ నెంబర్?

Update: 2018-04-06 02:37 GMT

టీవీ యాంకర్ రాధికా రెడ్డి ఎందుకు చనిపోయింది ? రాధిక చనిపొవడానికి ఒక వ్యక్తి కారణమా..? రాధికను ఫోన్ లో వెధించడం మూలంగానే ఆత్మహత్యకు పాల్పడి వుంటుందా..? రాధిక కాల్ లిస్ట్ లో వున్న వారు ఎవరు...? అసలు నిత్యం పదే పదే రాధిక కు కాల్ చేసి విసిగించిన వారు ఎవరు? ఇలాంటి వాటిపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. రాధిక మరణం వెనుక వున్న మీస్టరీని ఛేదించేందుకు పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

మిస్టరీ వీడలేదు.....

టీవీ యాంకర్ మృతిపైన ఇంకా మిస్టరీ వీడలేదు. రాధిక రెడ్డి ఎందుకు చనిపోయింది? ఎవరి వల్ల చనిపోయింది..? అసలు కారణం ఏంటి...? ఇలాంటి వాటిపైన పోలీసులు ఇంకా విచారణ చేస్తునే వున్నారు. అంతేగాకుండా అసలు రాధిక రెడ్డి మృతికి బలమైన కారణాలు ఎమై వుంటాయన్న దానిపైన విచారణ లోతుగా చేస్తున్నామని పోలీసులు చెప్పారు. రాధిక చనిపొవడానికి ముఖ్యమైన కారణం ఇదీ అన్న దానిపై ఎవరు క్లారీటి ఇవ్వడం లేదు. యాంకర్ రాధిక రెడ్డి చనిపొయి ఐదు రోజులవుతుంది. రాధిక రెడ్డి సూసైడ్ నోట్ ప్రకారం పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనికి తోడుగా రాధిక రెడ్డి కాల్ డాటా ఆధారంగా పోలీసులు విచారణ లో ముందుకు వెళ్లుతున్నారు. రాధిక చనిపొయిన తరువాత పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీన పరుచుకున్నారు. ఈ నోట్ ప్రకారం అయితే తన మెదడే తన శత్రువు అని పెర్కొంది. అయితే రాధిక రెడ్డి మెదడు తీసుకున్న నిర్ణయం ఎంటి ..? అంతటి కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అన్న దానిపైన పోలీసులు విచారణ చేస్తున్నారు.

కాల్ డేటా ఆధారంగా.....

ఇక పొతే రాధిక రెడ్డి గత పది రోజుల నుంచి కూడా ముభావంగా ఉంటున్నట్లు సహచరులు చెబుతున్నారు. గత పది రోజుల నుంచి ఫోన్ కాల్స్ తో తీవ్ర కలవర పాటు పడినట్లుగా చెబుతున్నారు అయితే ఈ కాల్ ఎవరిది. ? ఎందుకు ఈ కాల్ వచ్చినప్పడల్లా రాధిక భయపడింది? ఏడ్చింది ?అన్న కోణం కూడా ఇప్పడు ముఖ్యంగా మారింది. రాధిక రెడ్డి కాల్ డాటా ఇప్పడు కీలకంగా మారింది. ఎందుకంటే ఈ కాల్ డేటాలో ఒక్క నెంబర్ కీలకంగా మారింది. ఈ నెంబర్ నుంచి పదే పదే రాధిక రెడ్డికి కాల్స్ వెళ్లాయి.. వచ్చాయి. గత కొన్ని రోజులుగా ఒక వ్యక్తి నుంచి రాధిక రెడ్డికి పదే పదే కాల్స్ వచ్చాయని. అయితే సదరు వ్యక్తి రాధిక రెడ్డి ని ఎందుకు వేధించాడు? అసలు గంటల తరబడి రాధిక రెడ్డి సదరు వ్యక్తితో ఎందుకు మాట్లాడారు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత కొంత కాలం క్రితమే భర్త నుంచి విడాకులు తీసుకున్న రాధిక కు ఈ వ్యక్తి ఎందుకు కాల్ చేస్తున్నాడు? రాధిక రెడ్డి కాల్ డాటాతో పాటుగా మెసేజ్ లలో కూడా ఈ ఫోన్ నెంబర్ నుంచే ఎక్కువగా వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పడు ఈ కాల్ చేసిన వ్యక్తిని విచారించేందుకు పోలీసులు సన్నద్దం అవుతున్నారు. గత 14 సంవత్సరాల నుంచి సమస్యలతో రాధిక కొట్టు మిట్టాడుతునే ఉన్నారు. అలాంటి రాధిక ఇప్పడు ఇంతటి స్టెప్ ఎందుకు తీసుకుంది? అన్న ప్రశ్రకు సమాధానం వెతికే పనిలో పోలీసులు వున్నారు.

Similar News