ఆందోళనకరంగా ఆనం ఆరోగ్య పరిస్థితి

Update: 2018-04-13 01:59 GMT

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల వ్యాధితో ఆనం బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆనం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలియడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కిమ్స్ ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. వైద్యులను ఆనం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News