ఛోటా కే నాయుడు కుటుంబం ఇబ్బందుల్లో?

ప్రముఖ సినిమా కెమెరామెన్ ఛోటా.కె.నాయుడు కుటుంబం ఇప్పుడు ఇబ్బందులు పడింది. చోటా కె నాయుడు సోదరుడు శ్యామ్.కె.నాయుడు తనను వివాహం చేసుకుంటానని మోసం చేశాడంటూ ఆర్టిస్ట్ సాయిసుధ [more]

Update: 2020-05-27 08:16 GMT

ప్రముఖ సినిమా కెమెరామెన్ ఛోటా.కె.నాయుడు కుటుంబం ఇప్పుడు ఇబ్బందులు పడింది. చోటా కె నాయుడు సోదరుడు శ్యామ్.కె.నాయుడు తనను వివాహం చేసుకుంటానని మోసం చేశాడంటూ ఆర్టిస్ట్ సాయిసుధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ నగరంలోని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సాయి సుధ ఫిర్యాదు చేశార. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్యామ్ కె నాయుడు ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నిమిత్తం శ్యామ్ కె నాయుడు పోలీసులు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు. అయితే ఇదే సమయంలో సాయిసుధ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే కొంతకాలం నుంచి తనను వివాహం చేసుకుంటానని చెప్పి శ్యామ్ కె నాయుడు మోసం చేశారని ఆర్టిస్ట్ సాయిసుధా చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై తాము ఇరుపక్షాల వాదనలు వింటున్నా మని ఎస్.ఆర్.నగర్ ఇన్స్ పెక్టర్ మురళి తెలిపారు.

Tags:    

Similar News