జగన్ ను వదలని ఆంబులెన్సులు..!

Update: 2018-10-10 11:54 GMT

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని ఆంబులెన్సులు వదలడం లేదు. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా వరుసగా ఆయన నిర్వహించిన మూడు సభల్లోకి ఆంబులెన్సులు రావడం గమనార్హం. మొదటగా విజయనగరం జిల్లాలోనే నెల్లిమర్లలో సభలో జగన్ మాట్లాడుతుండగా... ఓ గర్భిణి స్త్రీతో ఓ ఆటో సభలోకి వచ్చింది. దీంతో జగన్ ప్రజలకు పక్కకు తప్పుకోవాలని కోరి సదరు ఆటోకు దారి ఇచ్చాడు. దీంతో పాటు 108 లు పనిచేయక ఆటోల్లో వెళ్లాల్సి వస్తుందని జగన్ ఆరోపించారు.

నేడు కూడా గజపతి నగరంలో.....

ఇక చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగిన తర్వాత సభలో జగన్ మాట్లాడుతుండగా 108 ఆంబులెన్స్ వచ్చింది. అయితే ఆ ఆంబులెన్సులో ఎవరూ లేరని, కేవలం 108లు పనిచేస్తున్నాయని చెప్పడానికి ఇలా సభలోకి ఖాళీ 108ని పంపించారని జగన్ ఆరోపించి.. దానికి కూడా దారి ఇప్పించారు. ఇక ఇవాళ గజపతినగరంలో జరిగిన సభలోనూ జగన్ మాట్లాడుతుండగా ఓ ప్రైవేటు ఆంబులెన్సు సభలోకి వచ్చింది. దీంతో జగన్ మళ్లీ ప్రజలను బతిమిలాడి ప్రజల్లో నుంచి దారి కల్పించి ఆంబులెన్సును పంపించారు. మొత్తానికి విజయనగరం జిల్లాలో వరుసగా మూడు సభల్లోనూ ఇటువంటివే సంఘటనలే జరగడం గమనార్హం.

Similar News