నెల గడిచిపోయింది

అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన నేడు 30వ రోజుకు చేరుకుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన [more]

Update: 2020-01-16 03:48 GMT

అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన నేడు 30వ రోజుకు చేరుకుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో ప్రజలు ఆందోళన బాట పట్టారు. మరోవైపు అమరావతి పరిరక్షణ సమితిని ఏర్పరచుకుని ఆందోళనలను ఉధృతం చేశారు. జేఏసీకి టీడీపీ, బీజేపీ, సీపీఐ, జనసేన వంటి పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ 29 గ్రామాలకే పరిమితమైన ఉద్యమాన్ని రాష్ట్రం మొత్తం విస్తరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈరోజు రాజధాని ప్రాంతంలో రైతులకు మద్దతుగా హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ పర్యటించనున్నారు. అలాగే సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణలు కూడా రైతులకు నేడు సంఘీభావం తెలపనున్నారు.

Tags:    

Similar News