రెండు నెలల తర్వాత ఏపీలో?

రెండు నెలల తర్వాత ఏపీలో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులకు విమానాలు చేరుకున్నాయి. విమాన ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. బెంగళూరు [more]

Update: 2020-05-26 03:42 GMT

రెండు నెలల తర్వాత ఏపీలో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులకు విమానాలు చేరుకున్నాయి. విమాన ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. బెంగళూరు నుంచి విజయవాడకు విమానం చేరుకుంది. శానిటైజేషన్ తర్వాత ప్రయాణికులను అనుమతిస్తున్నారు. కోవిడ్ పరీక్షలు జరిపి వారిని బయటకు పంపతున్నారు. గత రెండు నెలలుగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు నేడు సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. వారిని తమ ప్రాంతాలకు పంపించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా లక్షణాలుంటే క్వారంటైన్ కు తరలిస్తారు. లేకుంటే వారిని ఇంటికి పంపుతారు. ఏడు రోజుల పాటు వారు హోం క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది.

Tags:    

Similar News