రెండు వారాల పాటు లాక్ డౌన్ తప్పదు

కనీసం దేశంలో రెండు వారాల పాటు లాక్ డౌన్ విధిస్తేనే వైరస్ ను కంట్రోల్ చేయవచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. సెకండ్ వేవ్ లో [more]

Update: 2021-05-05 01:25 GMT

కనీసం దేశంలో రెండు వారాల పాటు లాక్ డౌన్ విధిస్తేనే వైరస్ ను కంట్రోల్ చేయవచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. సెకండ్ వేవ్ లో ఉధృతి తీవ్రంగా ఉందన్నారు. నైట్ కర్ఫ్యూలు, పాక్షిక లాక్ డౌన్ వల్ల ప్రయోజనం లేదని రణదీప్ గులేరియా తెలిపారు. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని ఆయన సూచించారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, కరోనా కేసులు తగ్గించడం, వ్యాక్సినేషన్ వేగంగా చేయడం వంటివి ప్రధాన కర్తవ్యమని రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News