అగ్రీగోల్డ్ ఆస్తుల కొనుగోలు మళ్ళీ జిఎస్సెల్ గ్రూప్ ముందుకొచ్చింది. ఆస్తుల కొనుగోలు కు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని హైకోర్టులో నివేదికను జిఎస్సెల్ గ్రూప్ దాఖలు చేసింది. హైదరాబాద్ లోని ప్రస్తుత ఆస్తుల విలువను ఖచ్చితంగా చెప్పాలని అగ్రీగోల్డ్ కంపెనీని హైకోర్టు ఆదేశించింది..ఏపీ లోని ఏడు ఆస్తుల విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జులై ఒకటి నుండి వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. మరో 20 ఆస్తులను ఏపీ సిఐడి కోర్టుకు సమర్పించింది. తెలంగాణలోని ఆస్తుల విక్రయానికి నాలుగు జిల్లాలో త్రిసభ్య కమిటి ఏర్పాటుకు హైకోర్టు ఆదేశించంది. తదుపరి విచారణను వచ్చే నెల 23 కు హైకోర్టు వాయిదా వేసింది.