ప్రపంచలోనే అతి పెద్ద రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ఇండియాలో జరగబోతోంది. దేశంలో అతి పెద్ద ఎంప్లాయిర్ గా ఉన్న రైల్వేస్ లో 90 వేల ఉద్యోగాలకు గాను రెండు కోట్ల ఎనభై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారట. దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఈ విషయం తెలియచేస్తుంది. రైల్వేలో వివిధ కేటగిరిల కింద పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇందులో 19 వేల రూపాయల నుంచి అరవైవేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి.ఈ పోస్టులకు దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది. అప్పటికే 2.80 కోట్ల అప్లికేషన్ లు రావడంతో రైల్వేశాఖకు పెద్ద పని పడినట్లయింది. వీరందరికి పరీక్షలుపెట్టడం, ఇంటర్వ్యూలు చేయడం వంటి ప్రాసెస్ జరగవలసి ఉంది.వచ్చే నెలలో మరో ఇరవైవేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తారట.