లేటు వయసులో జన్మనిచ్చింది
ప్రపంచంలో కొన్ని సంఘటలను చూస్తే నిజంగా ఇది సాద్యమా అనిపిస్తుంది…ఆశ్చర్యం వేస్తుంది. కాని ఇది మాత్రం చెప్పడానికి కాస్త విడ్డూరమే అయినా..74 ఏళ్ల భామ్మ తాజాగా కవలలకు [more]
ప్రపంచంలో కొన్ని సంఘటలను చూస్తే నిజంగా ఇది సాద్యమా అనిపిస్తుంది…ఆశ్చర్యం వేస్తుంది. కాని ఇది మాత్రం చెప్పడానికి కాస్త విడ్డూరమే అయినా..74 ఏళ్ల భామ్మ తాజాగా కవలలకు [more]
ప్రపంచంలో కొన్ని సంఘటలను చూస్తే నిజంగా ఇది సాద్యమా అనిపిస్తుంది…ఆశ్చర్యం వేస్తుంది. కాని ఇది మాత్రం చెప్పడానికి కాస్త విడ్డూరమే అయినా..74 ఏళ్ల భామ్మ తాజాగా కవలలకు జన్మనిచ్చింది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన మంగాయమ్మ వయస్సు 74ఏళ్లు. ఆమె గర్భవతి కావడంతో రాత్రి నొప్పులు వచ్చాయి. వెంటనే గుంటూరులోని అహల్య నర్సింగ్ హోంకు వెళ్లారు మంగాయమ్మ కు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. దీంతో ఇద్దరు అమ్మాయిలకు ఆమె జన్మనిచ్చింది. మంగాయమ్మకు వివాహం జరిగిన 57 ఏళ్ల తర్వాత గర్భం దాల్చింది. గతంలో 70 ఏళ్లకు ప్రసవం జరగడం ప్రపంచ రికార్డుగా ఉంది. కాగా ఇప్పుడు 73 ఏళ్ల వయసులో ప్రసవం ద్వారా అరుదైన రికార్డు నెలకొంది.
ఐవీఎఫ్ ద్వారా…..
తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1962, మార్చి 22న వివాహమైంది. వివాహం జరిగిన 56 ఏళ్ల వరకు ఈ జంటకు పిల్లలు పుట్టలేదు..పిల్లల కోసం మొక్కని దేవుడు లేడు..తిరగని దేవాలయాలు లేవు, చేయని పూజలు లేవు. వృద్ధాప్యంలో పడ్డా తల్లి కావాలనే కోరిక మాత్రం మంగాయమ్మకు అలాగే ఉండిపోయింది. ఈ క్రమంలో కృత్రిమ సంతాన సౌఫల్య విధానం గురించి తెలుసుకున్న మంగాయమ్మ తాను కూడా ఐవీఎఫ్ పద్దతిని ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. మంగాయమ్మకు ఎటువంటి అనారోగ్యం లేకపోవడంతో వైద్యులు ఆమెకు సంతాన సౌఫల్య చికిత్స ప్రారంభించారు. మొదటి సారికే వైద్యుల కృషి ఫలించి మంగాయమ్మ గర్భం ధరించింది. నేడు పండంటి శిశువులకు జన్మనిచ్చింది.