ఢిల్లీ లిక్కర్ స్కామ్ ‍‍: అప్రూవర్ గా మారిన శరత్ చంద్ర

యన అప్రూవర్ గా మారేందుకు దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది. శరత్ చంద్రారెడ్డి వివిధ సంస్థలు, వ్యక్తులతో కలిసి సిండికేట్ ఏర్పాటు చేసుకుని అవినీతి..

Update: 2023-06-01 10:17 GMT

delhi liquor scam

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పెనక శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఆయన అప్రూవర్ గా మారేందుకు దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది. శరత్ చంద్రారెడ్డి వివిధ సంస్థలు, వ్యక్తులతో కలిసి సిండికేట్ ఏర్పాటు చేసుకుని అవినీతి మార్గంలో సొమ్ము సంపాదించేందుకు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారంటూ ఈడీ అభియోగాలు నమోదు చేసింది. అలాగే అక్రమంగా నగదు చలామణి వ్యతిరేక చట్టం కింద కూడా కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడంతో.. లిక్కర్ స్కాం కేసులో ఇంకా ఎంతమంది పేర్లు బయటపడతాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గతేడాది నవంబర్ 11న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శరత్ చంద్రను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరి 27న తన నానమ్మ అంత్యక్రియల కోసమని బెయిల్ కు అప్పీల్ చేసుకోగా.. రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజులు బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 1న తన భార్య అనారోగ్య కారణాలతో మరోసారి బెయిల్ కోరగా.. నాలుగు వారాలు బెయిల్ మంజూరైంది. ఏప్రిల్ 25న బెయిల్ పొడిగింపు పిటిషన్ వేయగా.. దానిని అవెన్యూ కోర్ట్ తిరస్కరించింది. మళ్లీ మే 8న శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ వచ్చిన మొదటి వ్యక్తి శరత్ చంద్రారెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో నిందితుడిగా ఉన్న మనీశ్ సిసోడియా బెయిల్ కు అప్పీల్ చేసుకోగా.. మనీశ్ బెయిల్ ను ఇటీవలే కోర్టు తిరస్కరించింది. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో బెయిల్ పై బయటికి వెళ్లి సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని, అందుకే బెయిల్ ను తిరస్కరిస్తున్నట్లు కోర్టు తెలిపింది.


Tags:    

Similar News