KTR : నేడు బీఆర్‌ఎస్ నేతలతో కేటీఆర్ కీలక సమావేశం
నేడు బీఆర్‌ఎస్ నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.
నేడు బీఆర్‌ఎస్ నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చించనున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్ పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. పార్టీ అభ్యర్థి ఎంపికతో పాటు, ప్రచారంపైన కూడా ఆయన ఈ సమావేశంలో నేతలతో చర్చించనున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై...
జూబ్లీహిల్స్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. ఏ క్షణమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసే అవకాశముంది. దీంతో ఈ సమావేశంలో కీలక అంశాలతో పాటు పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేయడంపై నేతల నుంచి పీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.